=''/>

23, జనవరి 2010, శనివారం

మన జాతీయగీతం జనగణమన కు అరవైయేళ్ళు



జనగణమన అధినాయక జయహే ...భారత భాగ్య విధాత ...అంటూ యావత్ దేశం లో జాతీయతా భావాన్ని రగిలించే "జనగణమన"గీతాన్ని మన జాతీయగీతం గా ఏర్పాటు చేసుకొని రేపటికి సరిగ్గా అరవైఏళ్ళు.

విశ్వకవి " రవీంద్రనాథ్ ఠాగూర్ "కలం నుండి జాలు వారిన ఈగీతాన్ని 1950 జనవరి 24న రాజాంగసభ జాతీయగీతంగా అధికారికంగా ఆమోదించింది .

వాస్తవానికి ఈగీతాన్ని రవీంద్రుడు 1911డిసెంబర్ 27నే రాసారు. 1919లో ఈగీతాన్ని చివరిసారి స్వరపరిచారు .మనం అదే స్వరం లో ఇప్పటికీ పాడుకుంటున్నాము. ఈ గీతాలాపనకు సాధారణంగా 55సెకండ్లు పడుతుంది .


3 కామెంట్‌లు:

  1. ఇంతగొప్ప గీతం మన జాతీయ గీతం అంటే గర్వమే కాదు మనసు పులకరించి పోతుంది. దేశభక్తి పొంగిపోతుంది. రోజుకొక్కసారన్నా వింటే మనలో మానవత్వం, ప్రేమాభిమానాలు పెరుగుతాయేమో! చక్కటి 'జాతీయ సమైక్యత' ని చూపించారు.

    రిప్లయితొలగించండి