=''/>

7, జులై 2010, బుధవారం

మా తోటలోని పలురకాలమొక్కలు.

తిరిగి నిన్నటి పోస్టేమిటి అని వెళ్ళిపోకండి. నిన్న నాకొచ్చిన వాఖ్యలన్నీ మాయపోయాయని..ఏమి చేలో తెలియక, కామెంట్స్ మాయం:( :( ఐపోయాయన్న ఆత్రుతతో తొలిగించి ఈరోజు మళ్ళీ పోస్ట్ చేసాను. .అన్యదా బావించకండి .నాకు నిన్న కామెంట్స్ రాసిన వారందరికీ దన్యవాదాలు.మీకిష్టమైతే ఈరోజు కూడా మీవాఖ్య రాయండి ఓపికగా.

పునాస వేసి పది సంవత్సరాలవుతుంది. సంవత్సరానికి రెండు కాపులిస్తుంది.కాయలు కాసినప్పుడల్లా కొద్దిగా ఆవకాయ పెడుతూఉంటాము.పప్పులోకి,పులుసులోకి అన్నింటికీ వాడుతూ ఉంటాము.ఇంటిదగ్గర ఉండటముతో మాఇష్టం అనమాట. అన్ని రకాలుగానూ వాడుతూ ఉంటాము. పులిహార, పప్పుకూరలకి(ఏ పప్పుకూరైనా సరే),పులుసులకి,పచ్చళ్ళలోకి, పులుపు కోసం చింతపండు వేయకుండా ఒక మామిడికాయ వేస్తాము. రుచి బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి.


ద్రాక్ష పాదుని కడియం నర్సరీలనుండి మొక్కలు తెచ్చి అమ్ముతూంటారువాళ్లవద్దతీసుకునివేసాము. వేసి మూడేళ్లైంది. బాగా కాస్తుంది కానీ కొంచెం పుల్లగా ఉంటాయి. ఎలాగూ పుల్లగాఉంటున్నాయని,అప్పుడప్పుడూ పప్పుచారు కాస్తూంటాము.

బత్తాయిలు బుట్లో దాగున్నాయి. బత్తాకాయలకు మంచిరంగు వచ్చి,దొమపోటు తగలకుండాఉంటాయని ఇలా బుట్టలు కడతారు.



ఈ జామ మొక్క పెద్ద గా పెరగదు కానీ కాయలు పెద్దగా కాస్తాయి .అందుకే దీన్ని కెజీ జామ అంటారు .గింజలు ఎక్కువగాలేకుండా కాయ తినడానికి రుచిగా ఉంటుంది. .



ఇది అంజూర్ మొక్క. ఈ పళ్ళు రక్తసుద్దకి పని చేస్తాయి .ఈగింజలనే ఎండబెట్టి స్వీట్స్ లో వేస్తారు.చిన్నగా గసగసాలు లా ఉంటాయి.ఐదేళ్లైంది వేసి.పువ్వులు ఉండవు.ఆకుల దగ్గరే కాయలు వచ్చేస్తాయి.



శ్రీ గంధం మొక్క .ఈమొక్కవేసి పదమూడేళ్ళైంది. ఇది పారాసైట్ మొక్క .మొక్కలు గింజపడితే లెగుస్తాయికానీ,అది కొంచెం పెరిగే వరకూ పక్కన ఏదోఒక మొక్క సపోర్టు ఉండాలి .కంది మొక్క కు వేరు బాగుంటుందని కందిగింజలు పక్కనవేస్తారు. . అసలు గంధం వాసనేరాదు. మొక్క ముదిరి పూర్తిగా తయారవుతేనే వస్తుందంటున్నారు.


ఇది దాల్చిన చెక్క మొక్క.దీని ఆకులే పలావాకులు.ఐదేళ్లైంది వేసి.


16 కామెంట్‌లు:

  1. బలే వున్నాయండి అబ్బ ఎన్ని మొక్కలో.. మొక్కలో అనకూడదేమో, ఎన్ని చెట్లో.. సో లక్కీ మీరు. దాల్చిన చెక్క తీస్తారా బెరడు నుంచి? చాలా మంచి ఫొటోలు.

    రిప్లయితొలగించండి
  2. ఎన్ని వెరైటీల మొక్కలు, చెట్లు పెంచుతున్నారో మీరు..దాల్చిన చెక్క తో సహా!దీని ఆకులే తేజ్ పత్తా అని తెలిసి మరీ ఆశ్చర్యం! చాలా చాలా బావుంది మీ తోట.

    రిప్లయితొలగించండి
  3. అద్భుతం! అన్నీ మీరే చూస్తారా? తోటమాలులు ఎవరైనా సహాయం చేస్తారా?

    రిప్లయితొలగించండి
  4. mee toeTa chaalaa chaalaa baagundi. choochi maaku kulhlhu vastundi.

    రిప్లయితొలగించండి
  5. ee mokkalu ekkdi nuchi techaru pls tell me.

    రిప్లయితొలగించండి
  6. నిన్న అందరికీ కామెంట్ల ప్రాబ్లం వచ్చింది. మోడరేషన్ ఇమెయిల్ లోకెళ్ళి పబ్లిష్ చేస్తే వ్యాఖ్యలు వచ్చాయి ఇవ్వాళ. Anyways, మీరు మళ్ళీ రీపోస్ట్ చేసారుగా! మళ్ళీ కామెంట్ పెడతాను :)
    ఎంత బాగుందో మీ తోట! అర్జెంటుగా మీ ఇంటికొచ్చేసి ఓసారి మీ తోటలో తిరిగితే బాగుంటుందనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  8. బ్లాగరులో ఈ కామెట్ల ప్రాబ్లం వస్తూనే ఉంటుందండి. కొత్తల్లో ఏమిటో అర్థంకాక చిరాకొచ్చేసేది. ఇప్పుడు అలవాటయిపోయింది. :) మీ రెండు బ్లాగులూ మొత్తం చూశానండి. చాలా బాగున్నాయి. ఎంత ఓపిగ్గా ఫోటోలు తీసి పెడుతున్నారో. అలాగే మీ తోట కూడా చాలా బాగుంది. మా ఇల్లు గుర్తొచ్చేసింది చూడగానే.

    రిప్లయితొలగించండి
  9. భావనగారు,సుజాతగారుధన్యవాదాలు.
    ప్రభుగారు మాదెమీ పెద్ద తోట కాదండిచిన్నదే . మేమే చూస్తాము.ధన్యవాదాలు.
    సునీత థాంక్యు మా మొక్కలన్నీ నచ్చినందుకు.

    రిప్లయితొలగించండి
  10. అజ్ఞాత గారు కడియం నర్సారిలో తెచ్చామంది.
    @హను గారు,ధన్యవాదాలు.
    మధురవాణి గారు మా తోట మికు అంతనచ్చిందా ఐతే వచ్చేయండి ఇండియా వచ్చినప్పుడు.మీరు మల్లి కామెంట్ రాసినందుకు మెనీ మెనీ థాంక్స్.
    @ శిశిర గారు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. భలే ఉన్నాయండి ఫొటోస్ ! ఇంతకీ మీరే ఊర్లో ఉంటారో తెలుసుకోవచ్చా ?

    రిప్లయితొలగించండి
  12. గాంధీనగరం లోనే అంటే మాఊరి లోనే ఉంటాను. ఇంకా చెప్పాలంటే మా అమ్మగారి ఊరు, అత్తగారి ఊరు ఒకటే .ఒకే వీదిలో ఒక చివర అమ్మ వాళ్ళిల్లు ,ఒకచివర అత్తయ్య ఇల్లు.చాలా థాంక్స్ శ్రావ్య.

    రిప్లయితొలగించండి
  13. థాంక్స్ రాధిక గారు . అదృష్టం కదూ పుట్టిన ఊర్లో నే ఉంటున్నారు ఏమి మిస్ కాకుండా :)
    నేను మిమ్మల్ని అడిగినాక ప్రొఫైల్ చూసాను పశ్చిమ గోదావరి అని అర్ధం అయ్యింది రక రకాల మొక్కలు పెంచుతున్నారు కదా అందుకే అడిగాను. మేము పనస హైదరాబాద్ లో మాఇంట్లో పెంచుదాము అని చాలా ప్రయత్నం చేసాము కాని కాలా తరవాత తెలిసిన విషయం గాలి తేమ అవసరం అది పెరగటానికి అందుకే అది గోదావరి , కృష్ణ జిల్లాల ప్రాంతాల లోనే బాగా పెరుగుతుంది అని . అలాగే మీరు ద్రాక్ష పెంచటం నాకు భలే ఆశ్చర్యం వేసింది అది రెడ్ సాయిల్ లో బాగా పెరుగుతుంది .

    రిప్లయితొలగించండి
  14. wow....సాధారణంగా అందరూ పెరటిలో ఏవో చిన్న చిన్న మొక్కలు పెంచుతారు...మీరు ద్రాక్ష,అంజూరా,బత్తాయి,దాల్చిన చెక్కా....ఇల వెరైటీ గ భలె పెంచుతున్నరే...నాకు అన్నిటిలోకి నచ్చింది 'శ్రీ గంధం' మొక్క.మా అత్తగారి ఊరు రాజమండ్రీ.ఈసారి అక్కడికి వచ్చినపుడు మీ గాంధీనగరానికి వచ్చి మీ 'శ్రీ గంధం','అంజూరా,'ద్ర్రక్ష ' చూసి వెళ్ళాల్సిందే...

    రిప్లయితొలగించండి
  15. మీ మొక్కలన్నీ చాలా బాగున్నాయి. మీ అభిరుచి, దాని మీద మీరు చూపే శ్రద్ధ... అందంగా, కళకళలాడుతున్న ఆ మొక్కల్ని చూస్తుంటే అర్థమవుతోంది.

    అవునూ.. పప్పుచారా... ద్రాక్షచారా...? haha

    రిప్లయితొలగించండి