=''/>

21, అక్టోబర్ 2010, గురువారం

మా పెరట్లో తిరిగే సీతాకోకచిలుకల చిత్రాలు

మా ఇంట్లో రకరకాల పూల మొక్కలు ఉండడం తో సీతాకోకచిలుకలు బాగా వస్తుంటాయి. రంగురంగుల రెక్కలను అల్లల్లాడిస్తూ అవి పువ్వుల్లో మకరందం కోసం ......ఒకపువ్వు పై నుండి ఇంకో పువ్వు పై వాలుతూ ...అటూ,ఇటూ ఎగురుతుంటే చూడడానికి బలేఉంటుంది. ఫోటో తీయాలంటే మాత్రం చాలా కష్టం సుమండీ....


ఈ సీతాకోకచిలుకల ను ఫోటోల్లో బందించడానికి అష్ట కష్టాలు పడుతుంటాను.అవి అసలు ఒక పువ్వు మీద నుండి ఇంకో పువ్వు మీదకి అలా తిరుగుతూనే ఉంటాయి .ఒక్కో పువ్వు మీదా అరనిముషం ఉంటాయేమో ,ఫోటో తీయడానికి రెడీ అయ్యేలోపు వెళ్లి పోతుంటాయి .వాటి వెనకాల పరిగెడుతూ ఎలాగో తీస్తాను. ఒక్కోసారి గులాబీ ముళ్ళు గుచ్చుకుంటాయి .కానీ ఫోటోలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది.
ఇదేంటో ఇలా మడ్డి రంగులో ఉంటుంది .ఇది మిగిలిన వాటిలా ఓ ఎగిరిపోదు దేనిమీద వాలితే దానిమీదే ఉంటుంది బద్దకంగా .ఇది సీతాకోకచిలుక ల్లో ఒక జాతంట.

ఇది పెద్దగా ఉండి లైట్ నీలం రంగు రెక్కలతో చాలా బాగుంటుంది.

7 కామెంట్‌లు:

 1. Beautiful! :)
  నేను కూడా కొన్ని సీతాకోక చిలుకల ఫోటోలు తీశాను. చూసారా?
  http://madhurachitralu.blogspot.com/search/label/%E0%B0%B8%E0%B1%80%E0%B0%A4%E0%B0%BE%E0%B0%95%E0%B1%8B%E0%B0%95%E0%B0%9A%E0%B0%BF%E0%B0%B2%E0%B1%81%E0%B0%95%E0%B0%B2%E0%B1%81

  రిప్లయితొలగించండి
 2. రంగురంగుల సీతాకోక చిలుకలు చాలా బాగున్నాయి రాధిక గారు.

  రిప్లయితొలగించండి
 3. నాకు ఇక్కడ జూ లో ఇదే అనుభవం ఎదురైందండీ....అరె! ఫొటో తీస్తుంటే పొజ్ ఇవ్వొచ్చు కదా! వాటి సొమ్మెంపోయిందీ?? అటు,ఇటు ఎగురుతునే ఉంటాయి...పిచ్చిమొహాలు....కానీ భలె ముద్దొస్తాయి కదా!! అందుకోసమైనా శ్రమ తీసుకుని ఫొటోలు తీయాలనిపిస్తుంది :)

  రిప్లయితొలగించండి
 4. రాధిక గారు, మీ బ్లాగును చూసాను. చాలా బాగుంది. వీలు చూసుకొని మీరు వ్రాసినవి అన్నీ చదువుతాను. నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను. ప్రస్తుతం మంచి తెలుగు బ్లాగులకోసం వెతుకుతున్నాను. చాలా వరకు నిరాశే ఎదురవుతుంది. ఒక బ్లాగు గురించి తెలుసుకోవాలంటే, నేను ఒక పోస్ట్ చదివినా సరిపోతుంది. విషయం ఏమిటో అర్థం అవుతుంది. నేను అచ్చ తెలుగులో ఎవరు మంచిగా, ఏ విషయంఫై వ్రాసినా చదువుతాను. మీరు కూడా దయచేసి నా బ్లాగును చూడగలరు. మీకు నచ్చితే మీ అభిప్రాయాలను తెలుపగలరు మరియు ప్రోత్సాహాన్ని అందించగలరు.. మీరు మరిన్ని పోస్ట్ లు వ్రాయాలని కోరుకొంటూ మల్లి.

  రిప్లయితొలగించండి
 5. ధన్యవాదాలు కృష్ణప్రియ.
  మదురవాణి గారు మీ రంగురంగు రెక్కల సీతాకోకచిలుకలు చూసాను .నాకు బాగా నచ్చాయి.ధన్యవాదాలు..
  ధన్యవాదాలు జయ గారు.
  అవునండిఇందుగారు ..థాంక్స్ ఇందు.
  నేను మీ బ్లాగ్ చూసాను బాగుందండి.మల్లిగారు ధన్యవాదాలు నా బ్లాగ్ నచ్చినందుకు.

  రిప్లయితొలగించండి