=''/>

8, అక్టోబర్ 2010, శుక్రవారం

హమ్మయ్య బ్లౌజ్ మీద వర్కు చేయడం ఎలాగో పూర్తిచేసేసా ..రెండు నెలల నుండి ఈ జాకిట్టుకి వర్కు చేస్తున్నాను.ఈ మధ్య కొంచెం బద్ధకం ఎక్కువైంది లెండి .ఎవరికైనా చీరల మీద వర్క్ చేయడానికి రెండుమూడు నెలలు టైం తీసుకుంటారు .మరి నాకు బ్లౌజ్ మీద వర్కు చేయడానికి ఇంత టైంపట్టింది.ఇది మెడ డిజైన్.మెడ అంచుకి అవుట్ లైన్, జరీ దారంతో గొలుసు కుట్టు కుట్టి .... డైమండ్స్ కూడా జరీ దారం తో గొలుసు కుట్టు కుట్టాను.మధ్య లో పచ్చ దారంతో ముడులు వేసాను. అలాగే పువ్వులుకుడా జరీ దారంతో కుట్టి మధ్యలో గోల్డ్ పూసలు కుట్టాను .

ఇక మధ్యలో ఖాలీ అంతా గొలుసు కుట్టుతో దగ్గరగా కుట్టి మొత్తం నింపేసా ...అలా గొలుసు కుట్టుతో నింప డాన్ని పానీ వర్క్ అంటారు.చేతులకి ఇలా అంచు కుట్టి పైన పువ్వులు, బుటా వేసాను.


హమ్మయ్య ఎలాగో పిల్లలకి సెలవలు వచ్చేటప్పటికి పూర్తిచేసేను.వాళ్ళు ఇంటివద్ద ఉంటే అసలు కుట్టడం అవ్వదు.

మొత్తం డిజైన్, కుట్టు ఐడియా అంతా నాదే . ముందు మెడకే కుడదామని మొదలు పెట్టాను కానీ మెడ వర్కు అయ్యాక ,నా చేతుల దురద ఇంకా తీరక అలా ... అలా .. ఇలా కుట్టేసాను. చాలా తొందరగా రెండు నెలలలోనే పూర్తి చేసేసేను కదా .... -:)

ఎలాఉందంటారు?వర్కు ,డిజైను ...

14 కామెంట్‌లు:

 1. మీ వర్క్, డిజైన్ సూపర్ గా ఉన్నాయి ...మీరు కుట్టడానికే రెండు నెలలు తీసుకున్నారు ... నేనయితే గత రెండు నెలలనుండి డిజైనే సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాను...
  నా వైలేట్ కలర్ పరికిణి పైనా బీడ్స్ వర్క్ చేద్దామని అనుకుంటున్నాను .. రాధిక గారు మీ దగ్గర మంచి డిజైన్స్ ఉంటే ఇస్తారా

  రిప్లయితొలగించు
 2. ఎంత ఓపికగా కుట్టారండి . ఇలాంటివి చూసినప్పుడు నాకూ కుడుదామనిపిస్తుంది . కాని ఓపిక లేదు . డిజైన్ చాలా బాగుంది .

  రిప్లయితొలగించు
 3. చాలా చాలా బావుందండీ.. ఇంత డిజైన్ కుట్టడానికి రెండు నెలలు చాలా తక్కువ అసలు!
  btw, ఇప్పుడు బ్లౌజులకి ఇలా narrow neck ఫ్యాషనాండీ?

  రిప్లయితొలగించు
 4. సూపర్బ్ అండీ...డిజైన్ కి కలర్ కి మాచ్ అయింది.సింపుల్ గా బాగుంది.

  రిప్లయితొలగించు
 5. ఇలా వర్క్ చేసే వాళ్ళని చూస్తే భలే ఆశ్చర్యం, ఆనందం కలుగుతుందండీ నాకు! ఎంత ఓపిక,శ్రద్ధ కావాలి! నేను అప్పుడెప్పుడో Anchor వాడు ఆల్రెడీ డిజైన్లు వేసుంచి, సూదులూ, దారాలూ, ఇన్స్ట్రక్షన్లూ అన్నీ ఇచ్చి రెడీగా ఉంచిన క్రాస్ స్టిచ్ ప్రాజెక్టులు కొని తెచ్చి (సింపుల్ డిజైన్లే) సగం కుట్టి అక్కడ పడేశాను. ఇంత క్రియేటివ్ వర్క్ నా వల్ల కాదనిపిస్తుంది:-(

  మనలో మన మాట, ఆ బ్లౌజ్ పీసు నాకిచ్చేయకూడదూ, ఎంచక్కా!

  నిషిగంధ,
  ఇండియా వచ్చి చాలా రోజులైనట్లుంది కదూ :-)) ఇప్పుడు ఇక్కడ చీర వెయ్యి, జాకెట్ ఐదు వేలు ట్రెండ్ నడుస్తోంది, ఈ వర్కులతో!

  రిప్లయితొలగించు
 6. ఎంతబాగుందో. నాకూ ఓటి కుట్టియ్యొచ్చుగా:)

  రిప్లయితొలగించు
 7. వామ్మో సుజాతా, బ్లౌజు ఐదువేలా!! ఈ లెక్కన అక్కడ షాపింగ్ చేయాలంటే ఇక్కడనించి వచ్చేప్పుడు ఒక సూట్కేసులో అచ్చంగా నోట్ల కట్టలే తేవాలేమో!
  :-)

  రిప్లయితొలగించు
 8. @శివరంజని,నా వర్క్ నచ్చినందుకు ధన్యవాదాలు .మీకు ఎటువంటి డిజైన్ కావాలో చెపితే తప్పకుండా ఇస్తాను..
  @అజ్ఞాత ,ధన్యవాదాలు
  @మాలాకుమార్, కుట్టడం మొదలు పెడితే ఓపిక అదే వస్తుందండీ.ధన్యవాదాలు..
  @నిషిగంధ,బ్లౌజ్ వర్క్ కి పదిహేను రోజులు పడుతుందంతే ,నేను బద్దకంగా రెండు నెలలు కుట్టాను..పలక మెడ ఎప్పుడూ ఫాషనే నండి.సుజాత గారనట్టు మిరీమధ్య ఇండియా రాలేదండి?..ధన్యవాదాలు.
  .

  రిప్లయితొలగించు
 9. @ఇందు, ధన్యవాదాలు.
  @సుజాత,ఏంకర్ క్విక్ స్టిచ్ నేను కుట్టానండి.బాగుంటుంది .మనమేమీ అలోచించక్కక్కర్లేదు .వాడెలా ఇస్తే అలా కుట్టేయవచ్చు ఎంచక్కా ..తొందరగా పూర్తి చేసి ఫ్రెం కట్టించి మాకూ చూపించండి ..అమ్మో అది పట్టుచీర మీద బ్లోజ్.కావాలంటే మీకు ఇంకోటి కుట్టిస్తాను.
  ఇప్పుడు వస్తున్న వర్కు లు చూస్తుంటే కళ్ళు చెదిరి పోతున్నాయండిబాబు.రేట్లు అలాగే ఉంటున్నాయి .ఐనా ఎవ్వరూవర్క్లు చేయించడం మానట్లేదు.ధన్యవాదాలు.
  @జయ ,నచ్చినందుకు ధన్యవాదాలు.మీకు కుట్టనా?
  @నిషిగంధ గారు ,మీ ఎన్ ఆర్ ఐ లే కదండీ వాళ్లని బాగా పోషించేది.అలాగంటే ఎలాగా?


  .

  రిప్లయితొలగించు
 10. డిజైన్ చాలా చాలా బాగుంది రాధిక గారూ! నాకైతే బాగా నచ్చింది. :) మీరు కాబట్టి రెండు నెలల్లో పూర్తి చేసారు. నేనయితే ఎన్నేళ్ళయినా పూర్తి చేయలేను. ఎందుకంటే అసలు నాకు కుట్టడమే రాదు కదా! ;)

  రిప్లయితొలగించు