మా ఇంటి పక్కనున్న కొబ్బరి తోటలో .. ఈ మధ్య ఉదయమే బోల్డన్ని పిచ్చుకలు సందడి సందడి గా ,కిచ కచలాడుకుంటూ అటూ ఇటూ ఎగురుతూ కనిపిస్తున్నాయి. ఇదివరకు ఇంతిలా కనపడలే.. వినపడలే .. ఏమిటా అని ఓ రోజు కాస్త నిశితంగా గమనించి .. పరికించి చూస్తే ...
ఇవిగో ఈ గిజిగాళ్ళ దన్నమాట ఆ సందడి ! కొబ్బరాకుల్ని సన్నని ఈనెల్లా చీల్చుకుని ఈ గూళ్ళు కట్టుకుంటున్నాయి .. ఓ రోజు వట్టినే ఎలా గూళ్ళు కట్టుకుంటున్నాయో చూద్దామని వెళ్ళా . నేనున్నా ఐదు నిముషాల్లోనే సగం గూడు కట్టేసిందో గిజిగాడు !
ఈ రోజు మబ్బు మబ్బుగా ఉంది . మళ్లీ వర్షం పడితే అవుంటాయో వేరే చోటకి వెళ్ళిపోతాయో అనుకుని బద్దకించకుండా వెళ్లి వాటిని అట్టే విసిగించకుండా ఐదు నిముషాల్లో ఓ పది స్నాప్స్ తీసుకుని వచ్చేసా ..
అమ్మో ఐదు నిముషాలు మెడ పైకెత్తి వాటిని ఫోటోలు తీసేప్పటికి నా మెడ పట్టేసింది .. కాసేపట్లో సర్దుకుంది లెండి.
భలే చిత్రం కదా వాటి నైపుణ్యం !
నేతగాళ్లు పట్టుచీర నేసినట్టు...
రిప్లయితొలగించండిఈ గిజిగాళ్లు గూళ్లను ఎంచక్కా భలే అల్లుతాయండీ.
చిన్నప్పుడు విల్లంబులు ధరించి వీటి వేటకు వెడలేవాళ్లం. ఎక్కుపెట్టిన బాణాలు గూళ్లల్లో గుచ్చుకుని, అక్కడే ఇరుక్కుపోయి, పిచ్చుకలు దొరక్క, బాణాలు వెనక్కిరాక, బిక్కమొహాలేసుకుని ఇంటికొచ్చేవాళ్లం :-)
నాగ్ రాజ్ గారు గిజిగాళ్ల కోసమే విల్లంబులు ధరించేవారా ...బావుంది మీ జ్ఞాపకం :)
తొలగించండిఎంత బాగున్నాయో గిజి గాళ్ళు ,వాటి గూళ్ళు .వాటి ని కట్టడం లో ఎంత నైపుణ్యం ! మీ శ్రమ కి జోహార్లు
రిప్లయితొలగించండిథాంక్స్ అజ్ఞాత గారు .ఈ సారి కామేంట్ రాసినప్పుడు మీ పేరు కూడా రాయండి
తొలగించండిచాలా బాగున్నాయి గిజిగాడి కబుర్లు, ఫొటోలు. ఇండియన్ బార్డ్స్ అనే ఫేస్ బుక్ గ్రూప్ ఉంది చూడండి. మీకు నచ్చుతుంది.
రిప్లయితొలగించండిథాంక్స్ వర్మ గారు ..అప్పుడప్పుడూ చూస్తుంటానండీ
తొలగించండిఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండిvery nice
రిప్లయితొలగించండిthanks anDi
తొలగించండిచాలా బాగున్నాయ్ :)
రిప్లయితొలగించండిThank u :)
తొలగించండిwow! very nice..
రిప్లయితొలగించండిThanks Trushna garu
తొలగించండిbeautiful :)
రిప్లయితొలగించండిrani gaaru chaalaa rojulaki mi darsanam :) thank you
తొలగించండిvideo tiyalsiunde.memu vitini pichhukalu antamu.
రిప్లయితొలగించండి