=''/>

28, డిసెంబర్ 2009, సోమవారం

తేగలు


తేగలు వచ్చేసాయండి. సితాకాలము వస్తే మా ఏరియాలో బస్సులు ఆగేచోట,రోడ్లమీద తేగలు అమ్మేవారి సందడి ఎక్కువగా వుంటుంది .
పొలాలలోను, రోడ్లపక్కన తాటిచెట్లవద్ద తాటిటెంకలు అన్నీ సేకరించి వాటినిపాతర వేస్తారు .అంటే పెద్ద గొయ్యి తవ్వి దానిలోకప్పెడతారు .అవి సితాకాలము వచ్చేటప్పటికి మొలకెత్త డానికి తయారవుతాయి . వాటిని తీసి కుండలో పెట్టి కింద మంట పెట్టి కాలుస్తారు .
తేగలు అంటే చాలా మందికి చిన్నచూపు కానీ వీటిలో పీచుపదార్ధము మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది .ప్రకృతి మనకు అందించిన మంచి ఆహారము తేగ .
ఇదివరకు ఎవరిపొలాలలో వాళ్లు తాటిటెంకలను ఏరించి పాతరలు వేసేవారు .
ఇప్పుడు రైతులు కూడా కొనుక్కోవడానికి అలవాటుపడిపోయారు .

3 కామెంట్‌లు:

  1. "తేగతెచ్చిన తంటా "టపా రాసినప్పుడు ఒక బ్లాగర్ తేగల ఫోటో పెట్టమని అడిగారు కాని అప్పుడు నేను పెట్టలేకపోయాను .మీ పోస్ట్ చూడగానే అదంతా గుర్తుకొచ్చింది .సిటీకి వచ్చాక తేగలు , కొబ్బరిబొండాలు , మామిడిపళ్ళు వంటివి కొనుక్కోక తప్పటం లేదు.
    http://anu-parimalam.blogspot.com/2009/01/blog-post_09.html

    రిప్లయితొలగించండి
  2. ఇలా ఏకంగా ఫొటోనే పెట్టి నూరూరిస్తే ఎలాగండి. ఇక్కడ ఎన్ని డబ్బులు పెట్టి కొన్నా మా ఊరి వాటి రుచి రాదు.

    రిప్లయితొలగించండి
  3. పరిమళగారు,సిటీలలోనే కాదండి మాపల్లెటూర్లలోకూడా చాలామంది అన్నీ కొనుక్కోవడానికి అలవాటు పడిపోయారు.
    అవునండి సిరిసిరిమువ్వగారు కొన్నావాటికి రుచేమి ఉంటుంది .

    రిప్లయితొలగించండి