=''/>

8, జనవరి 2011, శనివారం

మా ఉళ్ళోసంక్రాంతి పండుగ హడావిడి .


ఊళ్ళలో "సంక్రాంతి పండుగ" రాబోతుందంగానే క్రిందట నెలనుండే అంటే డిసెంబర్ 15నుండి నెల పట్టడము(ధనుర్మాసం ప్రారంభం) జరుగుతుంది .సంక్రాంతి పండుగ హడావిడి మొదలౌతుంది



నెలపట్టడమంటే..ఈ నెల రోజులూ ఏ విధమైన శుభకార్యములూ లేకుండా కేవలము పండుగ మీదే దృష్టి పెట్టడము అని అర్ధం .

ఇంటిముందు ముగ్గుల్ని డిసెంబర్ 16 నుంచి ప్రారంభించి పెడతారు. అప్పటివరకు ముగ్గు లు ఎలా పెట్టినా..ఈ పండగ నెల రోజులూ మాత్రం ,వాకిళ్ళలో పేడతో చిక్కగా కల్లాపి జల్లి ,పిండితో రోజూ రకరకాలు ముగ్గులు పెడుతుంటారు.ఈ రోజుల్లో పెట్టే ముగ్గులు ఎక్కువగా గీతలతో పెడతారు .వాటిలో తాబేలు ముగ్గు ,తేలు,పాము ముగ్గు,చాలా బాగుంటాయి .అవి ఎక్కువగా పెడతుంటారు కూడా .
ఈ నెల రోజులూ ...హరిదాసు కీర్తనలతో ,జంగమ దేవరల గంటల సవ్వడి తో మా ఊరు బలే సందడిగా ఉంటుంది. .



ముగ్గులు పెట్టడమే కాకుండా పండగ కు ఇళ్ళు శుబ్రం చేయడంకూడా ఓ పెద్ద పని .కొందరైతే అటకు పైనున్న ఇత్తడి సామాను కూడా తోమించుకుంటారు. మా ఉళ్ళో ఐతే ఇంటి గోడలతో సహా గీకి గీకి మరీ కడిగేస్తారు.(ప్రస్తుతం మేమూఇదేపనిలో ఉన్నాము)

ఇక ఇళ్ళు ,వాకిళ్ళు ...తోముళ్ళు, శుబ్రాలైపోయాక చేసే ముఖ్యమైన పని పిండివంటలు చేసుకోవడం.
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలా పల్లెటూర్లలో రకరకాల పిండివంటలు చేస్తారనీ , అరిసెలు వండని ఇల్లు ఉండదనీ అందరికీ తెలిసిన విషయమే .మా ఊళ్ళోనూ అంతే .సంక్రాంతి పండుగకు వారం ముందుగానే ప్రతీ ఇంటిలోనూ అరిసెలు వండే హడావిడి మొదలవుతుంది . రోజూ ఉదయం ఎవరో ఒకరి ఇంటినుండి రోకళ్ళతో పిండి దంచుతున్న చప్పుళ్ళు వినపడుతూ ఉంటాయి .పిండి ఆడే మిల్లు ఉన్నా కానీ రోట్లో దంచిన పిండి తోనే అరిసె లు బాగా వస్తాయని, చాలా మంది ఇలానే చేస్తారు .మేము అంతే .అవేకాకుండా కరకజ్జం అంటే మిటాయచ్చు ,పాకుండలు చేస్తాం ..

ఈ పండగ పనులన్నీ అయ్యాక చదువులకోసం హాస్టల్ కి వెళ్ళిన పిల్లల కోసం ,ఉద్యోగాల కొరకు పట్టణాల కెళ్ళిన వాళ్ళకోసం తల్లితండ్రులు ఎదురు చూస్తుండగానే సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది. ఇక ఆ మూడు రోజులు మా ఊరు బలే సందడిగా ఉంటుంది.

నేనూ, పిల్లలకి సెలవలిచ్చేక మా అమ్మగారింటికివెళ్తాను. మా అమ్మ గారిది కూడా గాంధీనగరమే.. ఇళ్ళు కూడా ఒకే వీధిలో.మాకు ఇంచక్కా రైళ్ళకి,బస్సులకి టిక్కట్లు దొరకవేమో అనే టెన్షన్ ఉండదుగా :))) అక్కలు ,చెల్లి కూడా వస్తారు. పిల్లలు అల్లర్లతో,వాళ్ళు పెట్టే ముగ్గులతో ...పిండి వంటల ఘుమఘుమలతో....మా ఇల్లంతా(ఊరు ) "సంక్రాంతి పండగ "ముడు రోజులూ సందడే సందడి...



30 కామెంట్‌లు:

  1. నాకు కొన్ని అరిసెలు, కరకజ్జం ముక్క పార్సిల్ చెయ్యండి రాధిక గారు. అలాగే కనుమ రోజు వంటలు కూడా :-))

    రిప్లయితొలగించండి
  2. ముగ్గు అందం గా ఉంది. మీ పుట్టింటి ప్రయానికి ఎంత సద్దుకోవాలో ఎంత కష్టపడాలో పాపం :) మీ పోస్ట్ చాలా నచ్చింది నాకు.

    రిప్లయితొలగించండి
  3. కొట్టిన పిండి తో చేసిన అరిసెల రుచే వేరు. సరైన పాకం కుదరాలి. ఇవన్నీ చెప్పి ఊరిస్తున్నారు.అరిసెలు తినడానికి మీ ఊరు వచ్చేస్తాను.

    అవునూ ముగ్గు బాగుంది కానీ where is తాబేలు,తేలు or పాము. బుడబుక్కల వారి గంగిరెద్దు ఏది? ధనుర్మాసం లో ఉదయమే గుడికి పరిగెత్తే వారం చక్రపొంగలి, దద్ధోజనం కోసం.

    సంక్రాంతికి పల్లెటూరిలోనే ఉండాలండి. వస్తున్నాం వచ్చేస్తున్నాం . జాగ్రత్త .

    రిప్లయితొలగించండి
  4. post chaala bagundi...kaanee... pandagapoota kooda pata photo nena:)

    రిప్లయితొలగించండి
  5. అహాఁ.... ఇదండీ ఊరంటే! మీరేనండీ అసలుసిసలు తెలుగుఆడపడచు.

    రిప్లయితొలగించండి
  6. రాధిక గారు, నన్ను పెంచుకోరా ...ప్లీజ్...ప్లీజ్...ప్లీజ్.

    రిప్లయితొలగించండి
  7. బ్లాగు ముంగిట ముగ్గులు పరచి,పండుగ సంబరాన్ని బ్లాగంతా వ్యాపింపచేసి పండుగనాడు ఏంచేద్దాం అని అందరిలోను ఉత్సాహం రేకెత్తించారు.చాలా బాగా రాసారు.

    రిప్లయితొలగించండి
  8. మీ ముందస్తు సంక్రాంతి సంబరాల విశేషాలు నాకు చాలా నచ్చేసాయ్.

    రిప్లయితొలగించండి
  9. సంక్రాంతి రైతుల పండగ...

    గౌరవం,
    విలువ,
    ఆదరణ,
    ఉద్ధరణ,
    స్వాభిమానం,
    అండ,
    నమ్మకం,
    భవిష్యత్,
    భరోసా,
    అవకాశం,
    * అనుకూలత,
    ప్రేమ,
    కృతజ్ఞత,
    న్యాయం,
    అర్హత,
    * ప్రత్యేకత,
    సహాయత,
    ప్రొత్సాహం,
    ఉత్సాహం,

    కృంగిన కర్షక విచార హృదయాని అందినప్పుడే , అందించినపుడే నిజమైన క్రాంతి, సంక్రాంతి...
    అంతవరకూ అరిసెలు తిన్నా, ఆర్భాటాలు చేసుకున్నా అది ఉపవాస-సమానమే...

    రిప్లయితొలగించండి
  10. పల్లెల్లోని పండుగ సంబరాలని చక్కగా కళ్ళకి కట్టారు.

    రిప్లయితొలగించండి
  11. ఎంత బాగుందండి మీ వూరు . ఇంకా కొన్ని పల్లెటూళ్ళు ఇలా వున్నాయన్నమాట.
    కొట్టిన పిండి తో అరిసెలు చేసి ఎన్ని ఏళ్ళైందో ! అరిసెలు , చక్కిలాలు చేద్దామంటే తడి బియ్యం , అసలు బియ్యం కొట్టేవాళ్ళే కరువు మాకు . ఆ సాకు తో చేయటము మానేసాను :)
    బాగా రాసారు . పాపం పుట్టింటి కి వెళ్ళే తొందరలో వున్నారేమో మళ్ళీ మాట్లాడుకుందాం లెండి .

    రిప్లయితొలగించండి
  12. Akka enthaa response akka nee posts ki ? baagundhi post...meeru muggulu vesthe memu colors vese vaallam kadhaa :-) --Jaya

    రిప్లయితొలగించండి
  13. జయ అని ఇంగ్లీష్ లో ఇచ్చిన కామెంట్ నేను రాయలేదండి. ఎలా వచ్చిందో నాకు తెలీదు.

    రిప్లయితొలగించండి
  14. బావుందండీ మీ టపా...చిన్ననాటి స్మృతులు గుర్తుచేసారు.

    రిప్లయితొలగించండి
  15. రాధికగారూ....భలే ఉన్నాయ్ మీ సంక్రాంతి ముచ్చట్లు...పనిలో పని ఈ సంక్రాంతి రోజు కూడా మీ ఊరంతా చూపించేయండీ...నాకు మా ఇంట్లో అమ్మ దగ్గరుండి రోట్లో కొట్టించే అరిసెల పిండి దంపుళ్ళు గుర్తొస్తున్నాయ్! ఆ అరిసెలకి నేను,మా ఆంటీ అమ్మకి హెల్ప్ చేసేవారం :) నాకు ఎప్పుడన్న పళ్లెటూళ్ళో సంక్రంతి చూడాలని.మా అమ్మమ్మగారింట్లో ఉన్నప్పుడు సంక్రాతికి వెళ్ళేవారంకానీ నాకు అవన్ని లీలగా మాత్రమే గుర్తు :( మీ ఊరొచ్చేస్తా! మీ ఇంటికొచ్చేస్తా! మీ నట్టింటికొచ్చేస్తా! మీ అరిశెలు తినేసి పారిపోతా :))))

    రిప్లయితొలగించండి
  16. @మంచు ,అలాగేనండి.ధన్యవాదాలు.
    @కృష్ణప్రియ,:))ధన్యవాదాలు.
    @బులుసు సుబ్రహ్మణ్యం ,పాము,తేలు,తాబేలు ముగ్గులేసి ఫోటో తిద్దామనే టప్పటికి పారిపోయాయి :))గంగిరెద్దువాడు మా ఊరు ఈ మధ్య రావడం లేదండి అందుకే ఫోటో పెట్టడం కుదరలేదు..మీరుఎప్పుడైనా భీమవరం వస్తే మా ఊరికి తప్పకుండా రావాలి.
    @veeraiah,ధన్యవాదాలు.
    @మందాకినీ,ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. @జయ,ఉమాదేవి ధన్యవాదాలు.
    @పంతుల జోగారావు,ధన్యవాదాలు.
    @సత్య, బాగుందండి ధన్యవాదాలు.
    @మాలాకుమార్,శిశిర ధన్యవాదాలు.
    థాంక్స్ జయ .నువ్వు అక్కడికి వెళ్ళేక అన్నిమిస్సవుతున్నావా?

    రిప్లయితొలగించండి
  18. @జయ, తను మాకజిన్ అండి తనూ జయా నే :)
    @తృష్ణ ధన్యవాదాలు.
    @ఇందు,:))ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. chala baga rasaru post. naku ventane mi oorochhi pandaga chudalani undi . ilantivi emi levu asalu ikada :((((((

    రిప్లయితొలగించండి
  20. invitations pampetappudu nannu marchipovaddandee...nenuu vachchestunnaaa..a....a..
    jaya gaari korikea naakuu vachchindi..mammalni iddarinee penchukokoodaduu? meeru pettinavannee tini pedutoo, meeku srama ledundaa, meeru cheppinavannee lekhinilo wraasi pedataam kudaa..
    yemantaaru?

    రిప్లయితొలగించండి
  21. బావుందండీ . మీ టపా చదివినప్పుడు ఇంకా మన సంస్కృతీ పల్లెటూళ్ళ లో సజీవంగానే ఉందని ఆనందంగా ఉంది .

    రిప్లయితొలగించండి
  22. రాధిక గారూ! మీ ఉరు ఫోటోలు గంగి రెద్దులు,పగటి జంగం దేవరల విన్యాసాలు
    చాలా చాలాచాలాచాలా చాలా చాలాబాగున్నాయి.ఇలాంటి పల్లెటూరి అందాలు
    నిజంగా చాల భాగం అంతరించి పోయాయి.ఇక ఇలా బొమ్మల్లో చూడవలసిందే.

    రిప్లయితొలగించండి
  23. రాధిక గారూ! మీ ఉరు ఫోటోలు గంగి రెద్దులు,పగటి జంగం దేవరల విన్యాసాలు
    చాలా చాలాచాలాచాలా చాలా చాలాబాగున్నాయి.ఇలాంటి పల్లెటూరి అందాలు
    నిజంగా చాల భాగం అంతరించి పోయాయి.ఇక ఇలా బొమ్మల్లో చూడవలసిందే.

    రిప్లయితొలగించండి
  24. సంక్రాంతి పండుగ మొత్తం మీ ఇంట్లోనే కనిపించిందండీ.. బాగున్నాడు మీ హరిదాసు :-)

    రిప్లయితొలగించండి
  25. me blog eppude chusanu...chala bavundi...meku velunte na blog chusi me abhiprayam cheppagalaru...

    http://kallurisailabala.blogspot.com/

    రిప్లయితొలగించండి
  26. రాధిక గారు,
    మీ పద్ధతేమీ బాగాలేదండి. ఎక్కడో ఒక చోట, ఏ జనారణ్యాలలోనో, ఉరుకులు, పరుగులు పెడుతూ, ఈ జన్మకింతే అని ప్రశాంతంగా బతికేస్తున్న నాలాంటి వాళ్ళని ఇలాంటి ఫోటోస్ పెట్టి బాధపెడ్తున్నారే, ఇది మీకేమన్నా న్యాయంగా ఉందా? నిజంగా రాధికగారు, ఇంతవరకు నన్ను జీవితంలో ఎవరైనా ఏదైనా గాఢమైన కోరిక ఉందా అంటే లేదనే చెప్పేదాన్ని. అఫ్కోర్స్ , అలా ఎవరూ అడగలేదనుకోండి :)
    కానీ మీ బ్లాగ్ చూసాక మీ ఊరు చూడాలని చాలా, చాలా అనిపిస్తోంది. సో, నా బకెట్ లిస్టు లో మొట్టమొదటి ఎంట్రీ ఇదే.
    - విజయ జ్యోతి.

    రిప్లయితొలగించండి
  27. విజయ జ్యోతి గారు,మా జిల్లా వైపు వచ్చినప్పుడు మా ఊరు తప్పకుండా రండి. మా ఊరు, మా పొలాలు అన్నీ చూడొచ్చు..
    ధన్యవాదాలండి నా పొస్ట్,నా ఫొటోస్ నచ్చినందుకు.

    రిప్లయితొలగించండి
  28. పిండి వంటలన్నీ నాకు కుడా పార్సెల్ చేయండి :))
    బాగుంది పోస్ట్, మీ ఊర్లో తిరుగుతన్నట్టు అనిపించింది :)

    రిప్లయితొలగించండి