=''/>

6, మే 2014, మంగళవారం

నువ్వులు - నూనె - చిమ్మిలి !!



ఇప్పుడు నువ్వులు పంట వచ్చేరోజులు  కదా ! 

మా ఊళ్లో గిట్టుబాటవ్వడం  లేదని చాలా మంది నువ్వులు పండించక పోయినా ..   ఊరగాయ  పచ్చళ్ళ  లో నూ ,కూరల్లో వాడకానికి నూనె కి ,,పప్పు  కోసం ఇలా సంవత్సరమంతా వాడకానికి సరిపడా బస్తానో ,రెండు బస్తా లో ఎవరి వాడకాన్ని బట్టి వాళ్ళు   పండిన చోటనుండి తెప్పించు కోవడమే . 

ఈ సంవత్సరం బస్తా నువ్వులు ఏడు వేల రూపాయలు .నిరుటి మీద రెండు వేలు పెరిగింది . రేటు పెరిగినా సంవత్సరానికి  సరిపడా నిల్వ  చేసుకోవడానికి తప్పదు కదా !

నువ్వులు తెప్పించుకోవడం తేలికే కానీ అవి కడగడం అంటే  బాబోయ్ ! చాలా పెద్ద పని .నాకైతే  అపన్నయ్యే వరకూ  నిద్రే పట్టదు . 

 ఇక మాకేమో   ఈ రోజుల్లో కరంటు  ఒక  పూటే  ఉంటుంది .   నీళ్ళ కరెంట్ అంటే త్రీ ఫేస్ కరెంట్ ఇస్తాడు. ఓ వారం పుద్దన్న , ఓ వారం   మధ్యాహ్నం  అన్నమాట .. 
నువ్వులు కడగడానికి  బోల్డన్ని నీళ్ళు  పడతాయని ఉదయం కరెంట్ ఉన్నప్పుడే  కడగడానికి ముహూర్తం పెట్టుకుంటారంతా .. 

నువ్వులు కడగాలంటే ... నీళ్ళు పట్టుకోవడాలు, కడగడానికి మనుషుల్ని పోగేసుకోవడాలు !

రెండు మూడు రోజుల ముందే ఇద్దరి పాలేళ్ళకి  ,ఇద్దరు  నువ్వులు తెల్లగా కడగి ,చెరిగి బాగు చేసే   ఆస్థాన కూలి అమ్మాయిలకీ  పలానా రోజు నువ్వులు కడుక్కోవాలి మానకుండా రండి  బాబూ,అమ్మా  అని బుక్ చేసుకోవాలన్నమాట !

నువ్వులు రాత్రి  నీళ్ళ లో పోసి  నానబెట్టుకుని  తెల్లార  గట్ల  నుండి గడగటం మొదలెట్టేస్తారు . నువ్వుల నునె కోసమైతే ,నానిన నువ్వులు కొద్ది కొద్ది గా తీసుకుని  ఇనప బకెట్ లో  కానీ ,రోట్లో కానీ  వేసి  రోకళ్ళతో  రెండు మూడు నిముషాలు తొక్కి తీసేసి వాటిని నువ్వులు కడుక్కునే చిల్లుల డబ్బా ఉంటుంది .దాన్లో  వేసి రెండు మూడు సార్లు కడిగితే సరిపోతుంది . వాటిని ఎండలో పోసి ఆరబెట్టి ,ఆరాక శుబ్రం  గా చెరిగించి  జాగర్త చేసుకుని నునె కోసం మిల్లుకి  పంపించడమే !

 నువ్వు పప్పుకోసం  ఐతే  నానిన నువ్వుల్ని కాస్త ఎక్కువ సేపు పోటెయ్యాలి . వీటిని నువ్వులు కడుక్కునే డబ్బాలో వేసి ,   తెల్లగా కడగడానికి టాంక్ లో నీళ్ళ న్నీ  అయిపోవాల్సిందే .  ఒక్కోసారి కరెంట్ పొరపాటున ఆగిపోతే పక్కన పొలాల్లో టాంక్ వద్ద కెళ్ళి ఎలాగో పని పూర్తి చేసుకొస్తారు  పాపం .పొ ట్టు మొత్తం నీళ్ళలో పోవడంతో  కడిగిన నువ్వు పప్పు  ఎండలో ఆరబెట్టుకుని  నూపప్పు జల్లిడి తో  జల్లించుకుంటే సరిపోతుంది 

అప్పుడే కడిగిన నానుంటుందేమో నువ్వు పప్పు తినడానికి భలే రుచిగా ఉంటుంది :)

నువ్వు పప్పు  చేసుకున్న రోజే " చిమ్మిలి "  తోక్కుకోవడం అలవాటు మా వైపు .. 

చిమ్మిలి !   మన రాష్ట్రం లో అందరికీ  తెలుసా ? కోస్తా ప్రాంతం వాళ్ళ కే  తెలుసా ? అని నాకు ఎప్పటి నుండో డౌట్  ! 
తెలిస్తే ఎవరైనా చెప్పండే :)

                                            

చిమ్మిలి కి కేజీ నువ్వు పప్పుకి ,అరకేజీ బెల్లం కొలత ! 

నువ్వు పప్పు రోట్లో వేసి పొడయ్యాక ,బెల్లం కుడా వేసి ,బాగా కలిసి ముద్దయ్యే వరకూ తొక్కి ఉండలు చుట్టు కోవడమే.   మిక్సీ లో  వేసి కూడా అప్పుడప్పుడూ మధ్యల్లో చేస్తుంటాం కానీ   నువ్వు పప్పు ఫ్రెష్ గా ఉన్నప్పుడు చేసుకున్నదే రుచి బావుంటుంది . చిమ్మిలి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది . 

                                                   
                                                  


వెనకటికి  అత్తోరింటికి  వచ్చిన ఓ  కొత్తల్లుడు కి  చిమ్మిలి పెడతానంటే  ... మొహమాటానికి పోయి వద్దన్నాడట .  రాత్రి అందరూ  నిద్రోయాక మొహమాటపు  అల్లుడి కి చిమ్మిలి రుచి చూడాలనిపించి రోలు నాకడానికి   రోట్లో తలెడితే  .... తల  రోట్లో ఇరుక్కుపోయి లబో దిబో మన్నాడట !  అని చిమ్మిలి తొక్కినప్పుడల్లా నానమ్మ చెబుతుండేది :)



15 కామెంట్‌లు:

  1. నువ్వు పప్పు కడుక్కున్నప్పుడేనా ?? నాగుల చవితి కూడా చేస్తారనుకుంట .
    అవును మీ నాయనమ్మ గారు చెప్పిన కథ మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు , నిజంగా ఇరుక్కుపోతుందో లేదో అని నేను ట్రై చేసాను కుడా .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నువ్వుపప్పు కడుక్కున్నప్పుడేకాదండీ చిమ్మిలీ ఎప్పుడైనా చేసుకోవచ్చు .కాకపోతే పప్పు చేసినవెంటనే చేసుకుంటే బావుంటుంది.నాగుల చవుతికి పప్పు తో కాదు నల్ల నువ్వులు తో చేస్తారండీ .
      మరి తల ఇరుక్కుపోకుండా బయటికి వచ్చేసిందాండీ :)

      తొలగించండి
  2. అయ్యో నేను వ్రాసినదేమైంది? :(
    బాగుంది, ఇదంతా తెలియదు, రైసు మిల్లు మాదిరే వీటికీ మిల్లుంటుందనుకున్నా గానీ, నానబోస్తారనుకోలేదు. ఇప్పుడు జుట్టుకు రంగేసినట్టు ఒకవిధమైన నల్ల రంగు నూగులు వస్తున్నాయి అవి ఎందుకు అట్లున్నాయో తెలియడం లేదు.
    మేము శ్రావణమాస శుద్ధ చవితినాడు నాగులచవితి చేస్తాం ఆరోజు పచ్చి నూగులు (తడపము) బెల్లం ఎండుకొబ్బెర తో కలిపి దంచి నైవేద్యం పెడతాము. చలిమిడి కూడా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునా లక్ష్మీ దేవీ గారు :)మేమూ చవితికి కి నల్ల నువ్వుల చిమ్మిలి,చలిమిడి చేస్తామండీ ..

      తొలగించండి
  3. Baboi ! intha process vunda? photo lo chimmili chushu vunte noru vooruthondi :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాబోయ్ ! ఇంత ప్రొసెస్ వుంటుందండీ అజ్ఞ్నాత గారూ ..ఏంటో ఈ రోజు అజ్ఞాత ల కామెంట్లు :)

      తొలగించండి
  4. అసలు నేను చిమ్మిలి పేరే ఎప్పుడు వినలేదు.ఇంక అది ఎలా ఉంటుందో అసలే తెలియదు. :(
    మీరన్నట్టు కోస్తా ప్రాంతం వాళ్లకే తెలుసేమో మరి.

    రిప్లయితొలగించండి
  5. ma chinnappudu ma intlo kuda chesevaru. mi post chaduvutunte naku aa rojele gurthuku vachai. ma pillalamu, ma nanamma ganuga daggaraki velli mari nune adinchi techevallamu.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ జ్ఞాపకం పంచుకున్నందుకు ధన్యవాదాలండి.నా బ్లాగ్ కి స్వాగతం జ్యోతి గారు

      తొలగించండి
  6. ma chinnappudu ma intlo kuda chesevaru. mi post chaduvutunte naku aa rojele gurthuku vachai. ma pillalamu, ma nanamma ganuga daggaraki velli mari nune adinchi techevallamu.

    రిప్లయితొలగించండి
  7. I want chimmili vunda right now:-( Nice Article

    రిప్లయితొలగించండి
  8. I want chimmiri vunda right now:-( Nice Article..

    రిప్లయితొలగించండి
  9. nenu vinale chimmili ani peru. ma amma ayite nalla nuvvulu n bellam mixi patti undalu chestadi. dinni memu nuvvundalu antamu.

    రిప్లయితొలగించండి