=''/>

29, మార్చి 2014, శనివారం

ఓ సారిలా చూడండి :)


మరేమో ఈ మధ్య నేను వాకింగ్   కి వెళ్ళడం మొదలుపెట్టానా ... మొదట్లో రెండురోజులు చేతిలో కెమేరా లేదే అని ఫీలయ్యి తరువాత నుండీ మర్చిపోకుండా వెంట పెట్టుకెల్తున్నానన్నమాట   !

దారిలో  ఇలాంటివన్నీ కనపడుతూ అప్పుడప్పుడూ   నా నడకకి బ్రేక్ వేస్తూంటాయన్నమాట !

పాపం నాతోపాటు  వాకింగ్ కి వచ్చే పిన్నిలు అత్తలూ,కూడా రోజూ నే వేసే  బ్రేక్ లకి అలవాటుపడిపోయారు    :)

 నానీ, అది చూడు అంటూ ఒకళ్ళు .. ఇదివరకు ఏమీ పట్టించుకునేవాళ్ళం కాదు ఇప్పుడు   చుట్టుపక్కల చూడవే చిన్నమ్మీ అంటూ   వెల్తున్నాం అంటుంటారు .

ఏంటీ ? వాళ్ళక్కూడా పిచ్చి అంటించేస్తున్నా అనుకుంటూన్నారా !

     సరే  మీరూ  చూడండే మరి    !






 మేం వెళ్ళెటప్పటికి బోల్డన్ని చిలుకలు .  చాలా చిలుకలు మా  అలికిడికి వెళ్ళిపోగా ఇవిమిగిలాయి . ఇంకాస్త క్లారిటీ గా ఉంటే  బావుండు :(





బుల్ బుల్ పిట్టలు.  మొదటి సారి గా కాస్త బాగా తీసాననుకున్నా ..




సీమ చింతలు పువ్వు ,పిందే  తో  ...








వాళ్ళ మానాన వాళ్ళు  పిడకలు వేసుకోకుండా టక్కన ఇటు తిరిగారు .






25, మార్చి 2014, మంగళవారం

అమ్మమ్మూరిలో దుర్గమ్మ తీర్థం (తిరుణాళ్ళు ) !

అమ్మమ్మ వాళ్ళూరు  రెడ్డి గణపవరం ! రెడ్డి గణపవరం ,ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నింటినీ పదిహెనో శతాబ్ధం లో రెడ్డిరాజులు పరిపాలించారట .రెడ్డిరాజుల కాలం నాడు కట్టించించిన శివాలయం  ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది.నిత్యం పూజలూ జరుగుతున్నాయి. 

అక్కడే   వెలసిన" కనకదుర్గమ్మ"కు వంద సంవత్సరాల పూర్వం   నుండీ     ప్రతీ సంవత్సరం హొలీ పౌర్ణమి నుండీ  ఐదు రోజుల పాటు తీర్థం ఘనం గా జరుగుతుంది. 
చిన్నప్పుడు  తీర్థం ఎప్పుడొస్తుందా అనెదురు  చూసేవాళ్ళం . ఎంచక్కా ప్రతీ  ఏడూ  బడె గ్గొట్టేసి  మరీ వెళ్లి ,ఐదు రోజు లూ ఎండ ను కూడా  లెక్క చేయకుండా తిరిగేసేవాళ్ళం . 
ఈ మధ్య  వెళ్లి  ఐదారేళ్ళవుతుందేమో !  ఈ సారి సరిగ్గా తీర్థం  జరిగే టైం  కి అనుకోకుండా సెలవలు కలిసొచ్చి    హాస్టల్ నుండి సాయి  వచ్చాడు .  చెల్లి ,పిల్లలు కూడా రావడం తో అందరం కలసి వెళ్లాం . 




  

  దుర్గమ్మ గుడి ! మా చిన్నప్పుడు చిన్న గుడిసె లా ఉండేది .ఇప్పుడిలా ఉంది. 


 రెడ్డి రాజుల కాలం నాటి శివాలయం  . ప్రతీ  సంవత్సరం రంగులు వేసి వేసి  చుట్టానికి రాతి కట్టడం లా అనిపించదు.


               
ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న రాతి మండపం .









ఇటువంటి రాతి స్తంభాలు  రెండు , తుప్పల్లో  గుడి కి కాస్త దూరం లో ఉన్నాయి. దాని మీద డిజైన్ఇప్పటికీ చక్కగా కనిపిస్తుంది . వాటిని చూసిగుడి  దగ్గరే కాక వీటి దగ్గర కూడా శుబ్రం   చేయించాల్సిందే అనిపించింది .

 
గుడి కొచ్చే భక్తుల కోసం దుకాణాలు.






అక్క ,అమ్మమ్మ   ప్రతీ సంవత్సరం   బోల్డన్ని గాజులు  కొని పంపుతారు.ఈ సారి మేమే కొనుకున్నాం సంవత్సరానికి సరిపడా :)






ఎండలో తిరిగి అలసిపోయి   గోళీ సోడా  :)




జీళ్ళు  
                                                           








 చిన్నప్పుడు  తీర్థం లో బొమ్మలు   కొనుకెళ్ళి ... అబ్బ ! వాటిని ఫ్రెండ్స్ కి చూపి వాళ్ళని ఏమేడిపించే వాళ్ళమో  :)








6, మార్చి 2014, గురువారం

పాలకోవా ఎలా చేస్తానంటే ..

నాకు బాగా గా గా చెయ్యడం వచ్చిన ,నేర్చుకున్న మొదటి స్వీట్ "పాలకోవా" !
 బాగా చెయ్యడం రావడం వల్లేమో  ఇంట్లో పాలుండాలే   పిల్లలు ఎప్పుడడిగినా చిటెకలో అంటే ఓ గంటలో చేసేస్తా  :)  .  మరి  పాలకోవా చెయ్యాలంటే కనీసం గంట పడుతుంది.  ఒక లీటరైతే  గంట కి  కాస్త తక్కువ  టైం పడుతుంది కానీ ,ఎక్కువ పాలతో  ఐతే చెయ్యడానికి ఎక్కువ సమయమే పడుతుంది .  
పాలకోవా   ఇత్తడి పళ్ళాల్లో  చేస్తే  బావుంటుంది . ఒక లీటర్ పాలతో ఐతే  అడుగు దళసరి గా ఉన్న గిన్నె వాడొచ్చు కానీ ఇంకా ఎక్కువైతే ఇత్తడి పళ్ళెం కానీ ఇత్తడి మూకుడు కానీ మంచిది . 
 పళ్ళెం  లో ఐతే అడుగంట కుండా తిప్పడానికి తేలికగా వుంటుంది .పాలు తొందరగా ఆవిరవుతాయి .    

ఆవు పాలు పలచగా ఉంటాయి కాబట్టి  గేదె పాలతో చేసుకుంటే  మంచిది. 

  లీటర్ పాలకి   సోల  డు  పంచదార (పావుకేజీ పంచదార  )పడుతుంది . 



పళ్ళెం లో పాలు పోసి  పాలు సగానికి పైగా ఆవిరయ్యేవరకు   తిప్పుకోవాలి .  



పాలు  ఆవిరై చిక్కబడ్డాక పంచదార పోసి ,ఈ సారి  జాగర్త గా   తిప్పాలి. లేకపోతే  అడుగంటుకుని  ఎరుపు రంగులోకి మారిపోతుంది . అలా ఉంటే  రుచి మారక పోయినా మా పిల్లలు రంగు చుసి మాకొద్దంటే మాకొద్దంటారు .


ఇలా దగ్గర పడ్డాక  ,చిన్న ప్లేట్ లో కాస్త వేసి ఉండ చేసి చూసుకుని ఉండైపోతే  ,కొద్ది కొద్ది గా తీసుకుని చిన్న గరిటి తో బాగా పాముకుని చేతికి నెయ్యి రాసుకుని పాలకోవాలు  చేసుకోవడమే . ఈజీ గా చెప్పేసా కానీ ,ఒక్కోసారి   పంచదార పోయ్యగానే పాలు ఇరిగి పోతాయి . అటువంటప్పుడు  అడుగు సమానంగా ఉన్న గిన్నెకి  నెయ్యి రాసి ,విరిగి తొరకల్లా ఉన్న దాన్ని గట్టిగా పామితే బాగానే ఉంటుంది .కాని,పాలు విరక్కుండా ఉంటే  చూట్టానికి ,తినడానికి బావుంటాయి :))


పాలకోవాలు నొక్కడానికి  అచ్చులున్నాయి కానీ, నాకైతే ఇలా వేళ్ళతో చేస్తేనే నచ్చుతాయి . 

1, మార్చి 2014, శనివారం

ఈ నెల కౌముదిలో నా ఆర్టికల్ !







ఈ నెల కౌముదిలో నా టెంథ్ క్లాస్ ఆర్టికల్ అచ్చైంది . క్రింది లింక్ లో చూడొచ్చు

http://www.koumudi.net/Monthly/2014/march/march_2014_tenthclass.pdf

ఏదో బ్లాగ్ లోమూడు రాతలు రాసుకుని , ఆరు ఫొటో లు పెట్టుకునే  నన్ను కౌముది వైపు అడుగేయించిన నా చిన్నారి స్నేహితురాలికి :) ,నా ఆర్టికల్ ప్రచురించినందుకు కౌముది కిరణ్ ప్రభ గారికి ధన్యవాదాలు.