జరగబోయే దాన్ని నీవు ఆపలేవు ..
ఉన్న వాటితో నీవు ఆనందించు ..
హాయగానవ్వుతూ జీవించు..
అందరికీ ఆనందాన్ని పంచు ..
కష్టాలను దైర్యముతో ఎదిరించు ..
నీకు నీవే సాటని నిరూపించు ..
కలకాలం సంతోషముగా జీవించు .
నూతన సంవత్సర శుభా కాంక్షలు
=''/>


*బిస్కట్లు చేయడానికి కావలసిన పదార్ధాలు .


అబ్బ వీళ్ల జామ చెట్టుకి కాయలు చాలా ఉన్నాయే ... ఈ మధ్య కోతులు రాలేదో యేమిటో.. అనుకొంటూ ఒక చిలుకమ్మ మాజామ చెట్టు మీద వాలిందితొందరగా తినెయ్యాలి.ఎవరైనా వస్తారు .ఎలా ఉన్నామంటావు ఫొటోలో ,అని ఒక చిలుకమ్మ ఇంకొక చిలుకను అడిగింది . మనకేం సూపర్ గా ఉంటాము.ఇంకా వాళ్ళే ఫొటో తీసుకోవడానికి మేకప్‌పై ,లిప్స్టిక్కులూ గట్రాలూ పూసుకుంటారుఅని ఇంకో చిలుక అంది.
మాజామ చెట్టు మీద రోజూ చిలుకలువాలి జామకాయలన్నీ తినేస్తాయి. వాటిని చూస్తూ సరదాగా అవి ఇలా అనుకొంటే ఎలా ఉంటుంది అని ఊహించి వ్రాసాను. ఎలాఉందో చెప్పండేమరి.
ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి షష్టి .మాజిల్లాలో అత్తిలి లోను ,చాగల్లు లోను షష్టి ఉత్సవాలు (నాకు తెలిసినవి .) బాగాజరుగుతాయి .మాచిన్నప్పుడు మాఊరు లో సుబ్రహ్మణ్య స్వామి గుడి లేక మేమంతా మాకు దగ్గరలో యాదవోలు అనే ఉరు వెళ్ళేవారము. అక్కడ బాగా జరుగుతుంది. మేము ప్రొద్దుటే ట్రాక్టర్ వేయించుకొని వెళ్లి స్వామిని దర్శించుకొని ,దుకాణాలు చూసుకొని మద్యాహ్నానికి వచ్చేవాళ్లము .ఫేమస్ వెంకటరమణ కొత్త సంవత్సరపు కేలండర్ లు ముందు షష్టి దుకాణాల లోకే వస్తాయి .

అదేంటి ,అందిన ద్రాక్ష పుల్లన అంటున్నాననుకొంటున్నారా ....... అసలుకదేమిటంటే..మా ప.గో.జిల్లాలో వారికి అసలుద్రాక్షపాదులు ఎలా ఉంటాయోతెలియదు.అటువంటిది ఈమధ్యన అందరూ కడియం నర్సరీ(మాకు కడియం నర్సరీ లు బాగా ఫేమస్) నుండి ద్రాక్ష పాదు లు తెచ్చి ఇళ్ల వద్ద పెంచుతున్నరు .అది చూసి మేము కూడా ఒకటి తెచ్చివేసాము .కొన్ని రోజులకి అది బాగాపెరిగింది .పూత కూడా బాగా వచ్చి గుత్తులు గుత్తులుగా కాయడం మొదలుపెట్టింది .ఇక మేము అవి ఎప్పుడు పండుతాయా ,యెప్పుడు తిందామా అని యెదురు చూస్తూఉన్నాము. మేము ఎదురు చూస్తున్నరోజు రానే వచ్చింది .చాలా ఆత్రంగా తయారైన గుత్తులన్నీ కోసేసేము .తీరా తిందామనినోట్లో పెడితే పుల్ల పుల్లగా వగరుగా ఉన్నాయి.అప్పుడు అనుకొన్నాము ,అందిన ద్రాక్ష కూడా పులుపేనని. . అప్పటి నుండి వాటిని యేమి చేయాలో తెలియక వాటితో పప్పు చారు కాస్తున్నము .నిజమండిబాబు. పచ్చి గుత్తులను కోసి కాయలను ఉడకబెట్టినీళ్ళు పిండి పప్పు లోవేసి ,ఉప్పు కారం వేసి ఉడికిస్తే ... ద్రాక్షకాయలతో పప్పుచారు రెడీ . . ఎలాఉందండి మాద్రాక్షకాయల పప్పుచారు.... . 
దశమిరోజున తప్త కాంచనకాంతితో ,కోటిసూర్య సన్నిభమైన ప్రభాజాలముతో,రత్నభూష భూషితమైఅలరారుతారు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి.సర్వ మానవ జీవితాలలో సర్వశక్తికి కేంద్ర స్థానం జగజ్జననే .అడ్డంకులను ఎదుర్కునే శక్తిని ,లొక కళ్యాణ కార్యాలలో విజయాన్ని ప్రసా దించమని ఆ తల్లిని స్వచ్చమైన మనసుతో వేడుకుంటె ఆమె సహ్రుదయ స్వరూపిణియై అశీర్వదిస్తుంది .దసరా పేరుతో మనం జరుపుకొనే విజయదశమి చెడుపై విజయానికి ప్రతీక .